అల్లూరి యూత్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు.
అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:
నిర్వాహకలు అల్లూరి యూత్ సభ్యులు బల్లా ప్రసాద్ ఆధ్వర్యంలో పాటలు,నృత్యాలతో మొదలైయ్యాయి.
వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు షీల్డ్స్ ఎమ్మార్వో తిరుమల రావు,ప్రిన్సిపాల్ సత్యరాజులు,సర్పంచ్ సింహాచలం, వైస్ ఎంపీపీ నూకాలమ్మ, సీనియర్ అసిస్టెంట్ దుమంతి సత్యనారాయణ,పీడి (కొచ్) అంబటి నూకరాజు,ఎపిఆర్ కళాశాల లెక్చరర్లు విజయ్,మారయ్య, ఉదయ్, గొకిరి చిన్నారావు, సీపీఎం నాయుడు,విఆర్ఓ సత్యనారాయణ, సచివాలయం సిబ్బంది రాజు,దిబ్బా సతీష్,నాగేంద్ర, పాల్గొని అందించారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన అతి పెద్ద లిఖితపూర్వక గ్రంధం అయిన రాజ్యాంగం అమోదించబడిన దినం ను శనివారం రాజేంద్రపాలెం లో గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి.. ఒక పండుగలా ప్రజలు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని నిర్వహించారు…
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మార్వో తిరమలరావు రాగ గౌరవ అధక్షులుగా ఏపీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ సత్యరాజ్ హాజరయ్యారు.
పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ రాజ్యాంగం అనేది లేకపోతే ఓటు హక్కు అనేది లేదు అని,పౌరసత్వం లేదు అని, చదువుకునేందుకు అర్హత లేదు అని,రాజ్యాంగం అమోదించబడిన నాటి నుండి నేటి వరకు వాటిని మనం హక్కుగా పొందాము అంటే అది అంబేద్కర్ వల్లనే అని అన్నారు.
రాజ్యాంగం ఏర్పాటు కాక పోతే 5వ షెడ్యూల్డ్ ప్రాంతంగా ఉండేది కాదు అని, ఈరోజు మనం అనుభవిస్తున్న హక్కులు, హోదాను, రాజ్యాంగం రాసిన డాక్టర్ అంబేద్కర్ దయ అని అన్నారు.
రాజ్యాంగం అంటే ఒక రిజర్వేషన్ మాత్రమే కాదు అని,పరిపాలన విధానంకు,పాలకులు పాలించడానికి, ఒక దిక్సూచి గా శిక్షలు ఖరారు చేసే శాసనం అని,ఎవరైనా రాజ్యాంగం పరిధిలో ఉంటారు తప్ప, దానిని దాటి పోవడం కుదరదు అని అన్నారు.
అనంతరం వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న కాలేజ్, స్కూల్ పిల్లలకు,షీల్డ్స్…వచ్చిన అతిధుల చేతులు మీదుగా అందించడం జరిగింది. వాటితో పాటు అంబేద్కర్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల,కాలేజ్ పిల్లలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.