Breaking News

పెదవలస లో పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు.

0 22

 మావోయిస్టు పీ ఎల్ జి ఏ వారోత్సవాల నేపథ్యంలో అల్లూరి జిల్లా, జీకే వీధి మండలంలోని పెదవలస లో జీకే వీధి సీఐ అశోక్ కుమార్, కొయ్యూరు సీఐ స్వామినాయుడు ముమ్మర తనిఖీలు చేపట్టారు.ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి విడిచి పెట్టారు.


అలాగే ఈరోజు పెదవలస సంతలో సంతకు వచ్చిన  యువతతో జీకే వీధి సిఐ అశోక్ కుమార్, కొయ్యూరు సీఐ స్వామి నాయుడు, అసిస్టెంట్ కమాండో దేవేంద్రనాథ్ యువతను ఉద్దేశించి మాట్లాడారు. గంజాయి, నాటుసారా పై అవగాహన కల్పించారు.లాటరీ, బ్యాంకు పేరు చెప్పి ఫోన్ చేస్తున్న వారికి మీ ఓటీపీ చెప్పొద్దని, ఎటువంటి లావాదేవీలైన బ్యాంకు దగ్గరికి వెళ్లి తెలుసుకోవాలని, అంతేగాని ఫోన్ చేసి ఓటిపి చెప్పమంటే చెప్పొద్దని యువతకు అవగాహన కలిగించారు.

Leave A Reply

Your email address will not be published.