Breaking News

క్రాప్ జోన్ ఆర్గో ఫారెస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో పొగరాని పొయ్యిల గురించి అవగాహన.

0 42

 అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం నల్లగొండ పంచాయితీ లోని వైఎన్ పాకలు గ్రామంలో శనివారం క్రాప్ జోన్ ఆర్గో ఫారెస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో పొగరాని పొయ్యిల గురించి అవగాహన.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్.

ఏభై వేల పొగరాని పొయ్యిల పంపిణీ కి సంస్థ ప్రణాళిక.


ఈ సందర్భంగా క్రాప్ జోన్ ఆర్గో ఫారెస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్ మాట్లాడుతూ ఈ ఆధునిక పొయ్యి వలన సాంప్రదాయ పొయ్యి కంటే 3.5 రెట్లు అధిక సామర్థ్యం, 70% తక్కువ వంట చెరుకు వినియోగం, తద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చు అని అన్నారు.


ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాట్లాడుతూ పొగరాని పొయ్యి వలన వంట చెరుకు ఆదాతో పాటు, ఆరోగ్యం ఆదా కూడా ఉంటుందని అన్నారు.

పొగ వల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని, దానివల్ల క్యాన్సర్, త్రోట్,ఊపిరితిత్తులు మొదలగు రోగాలు వచ్చే అవకాశం ఉందని, ఈ పొగరాని పొయ్యి వలన ఆరోగ్యంతో పాటు, పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చని, ఈ కార్యక్రమానికి మేము స్వాగతిస్తున్నామని, ప్రతి ఒక్కరికి అందేలా సంస్థ చొరవ తీసుకోవాలని ఎంపీపీ అన్నారు.


ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు కొప్పు రాజులమ్మ, సర్పంచ్ రాజకుమారి,ఇరువాడ దేవుడు, ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేష్, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్, కొయ్యూరు మండల కోఆర్డినేటర్ మనిబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.