Breaking News

కొయ్యూరు:మావోయిస్టులకు సహకరించవద్దు:సీఐ,ఎస్ఐ

0 21

 మావోయిస్టులకు సహకరించవద్దు:సీఐ,ఎస్ఐ

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:


మావోయిస్ట్ పార్టీ PLGA వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో కొయ్యూరు సిఐ స్వామి నాయుడు, కొయ్యూరు ఎస్సై రాజారావు తమ సిబ్బందితో బాలరేవుల రహదారి నందు వాహనాల తనిఖీలు నిర్వహించి, అనంతరం కొయ్యూరు వారపుసంత నందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ,ఎస్ఐ లు మాట్లాడుతూ..ఎవరూ మావోయిస్ట్ లకు సహకరించవద్దు అని, మావోయిస్ట్ లకు సహకరించి మీ అభివృద్ధిని మీరు దూరం చేసుకోవద్దు అని తెలియజేయడం జరిగింది.మావోయిస్ట్ ల కళ్ళబొల్లి మాటలు నమ్మి వాళ్లకు సహకరించి ఇన్నాళ్లలో మీరు సాధించింది ఏమి లేదని,పైగా వారి వల్ల మీకు రహదారి గాని, సెల్ టవర్స్ గాని ఎటువంటి అభివద్ధి జరుగకుండా అభివృద్ధికి ఆటంకంగా వారు ఉన్నారని తెలియ పరచటం జరిగింది. మావోయిస్ట్ లకు సహకరించి మీ అభివృద్ధిని మీరు దూరం చేసుకోవద్దు అని తెలియజేయటం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.