Breaking News

గిరిజన విద్యార్థుల మృతిపై సమగ్ర విచారణ నిర్వహించాలి:బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వినర్ బాక లవకుశ.

0 25

 గిరిజన విద్యార్థుల మృతిపై సమగ్ర విచారణ నిర్వహించాలి:బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వినర్ బాక లవకుశ.


అల్లూరి సీతారామరాజు జిల్లా: గిరిజన విద్యార్థులు తరచుగా అల్లూరి జిల్లాలో మృతి చెందడంపై సమగ్ర విచారణ నిర్వహించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక(సీఆర్పీఎఫ్) జిల్లా శాఖ డిమాండ్ చేస్తుంది.సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఫోరం జిల్లా కన్వీనర్ బాకా లవకుశ మాట్లాడుతూ పాడేరు మండలం డోకులూరు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి సీదరి సూరిబాబు అనారోగ్యంతో జి.మాడుగులలో ఇంటి వద్ద మరణించారని అన్నారు.తీవ్ర అనారోగ్యానికి గురౌతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యo అందించడానికి గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మీన మేశాలు లెక్కిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని వాపోయారు.దీనికి ముఖ్య కారణం అనేక పాఠశాలల్లో హెల్త్ అసిస్టెంట్లని తొలగించడమేనని, ఆశ్రమ పాఠశాలల్లో ప్రాథమిక వైద్యం అందించే ప్రక్రియ కూడా చర్యలు చేపట్టడం లేదని వాపోయారు.విద్యార్థులు మరణ మృదంగం గత 20 రోజులుగా జరుగుతున్నా చర్యలు సున్నా అన్నారు.నెంబర్ వన్ స్కూల్ లో 7 వ తరగతి చదువుతున్న

పాంగి నవీన్ (14),జి.మాడుగుల మండలం గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతూ అనారోగ్యంతో కంకిపాటి హారిక మృతి చెందారన్నారు.డోకులూరు ఆశ్రమ బాలురు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి సీదరి సూరిబాబు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారన్నారు. డుంబ్రిగూడ మండలం ఎంపిపి పాఠశాల విద్యార్థి గడ్డంగి శామ్యూల్ 6వ తరగతి చదువుతూ అశువులు బాశారన్నారు.పేదరికంతో కొండలు, కోనలు దాటి విద్యాభ్యాసానికి వచ్చిన విద్యార్థులు అశువులు బాస్తుండడంతో తల్లిదండ్రులు పాఠశాలలకు పంపించడానికి భయపడుతూ ఆందోళనలో ఉన్నారని అన్నారు.ఈ విషయాన్ని రాష్ట్ర,కేంద్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ల దృష్టికి తీసుకువెళుతున్నామని అన్నారు. బాలల హక్కులకు విఘాతం కల్గితే చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఉపేక్షించేది లేదని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.