Breaking News

చిత్తూరు,వైఎస్సార్,అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పడనున్న భారీ వర్షాలు .

0 21

 అమరావతి:


ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ


ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం 


ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ లో బలపడిన అల్పపీడనం 


ఇది పశ్చిమ-వాయువ్య దిశగా పయనించి ఈ రోజు సాయంత్రానికి వాయుగుండంగా మారే అవకాశం


ఇది క్రమంగా ఎల్లుండి ఉదయానికి తుఫానుగా బలపడి 

ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి ఆనుకుని ఉన్న దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం 


దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో దక్షిణకోస్తాలోని ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి, 

రాయలసీమలోని చిత్తూరు, YSR , అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు 


మిగిలిన చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం 


వర్షాల నేపధ్యంలో ఇప్పటికే ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి సూచనలు జారీ 


దక్షిణకోస్తాంధ్ర -తమిళనాడు తీరాల వెంబడి శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదు


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

Leave A Reply

Your email address will not be published.