మావోయిస్ట్ పీ ఎల్ జి ఏ వారోత్సవాల నేపథ్యంలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం.
మావోయిస్టు పార్టీ పి ఎల్ జి ఏ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలంలో ఏరియా డామినేషన్ ప్రోగ్రామ్, వాహనాలు తనఖీ లను చేయడం జరుగింది. భద్రతా చర్యల్లో భాగంగా చీడిపాలెం నుండి బూదరాళ్ల వరకు మంప ఎస్సై లోకేష్ కుమార్ తమ సిబ్బంది సహాయంతో ఏరియా డామినేషన్ ప్రోగ్రామ్స్ ను చెయ్యటం జరిగింది.