Breaking News

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ కు 84 మంది అభ్యర్థులు హాజరు.

0 23

 పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ కు 84 మంది అభ్యర్థులు హాజరు.


అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో గిరిజన యువత జీడి, ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సీఐ స్వామినాయుడు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం కొయ్యూరు ఎస్ఐ రాజారావు, మంప ఎస్సై లోకేష్ కుమార్ తో కలిసి కాకరపాడులోని గురుకుల జూనియర్ కళాశాలలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు  దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ముందుగా ఎత్తు, బరువు చూసిన అనంతరం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది.

ఈ స్క్రీనింగ్ టెస్ట్ కు మొత్తం 84 మంది అభ్యర్థులు హాజరయ్యారని, ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఐటీడీఏ, పోలీస్ వారి సహకారంతో ఉచిత వసతి, కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సిఐ స్వామినాయుడు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.