Breaking News

చింతవానిపాలెం లో ఉన్న వాటర్ ఫాల్స్ ప్రాంతాన్ని ఆక్రమిస్తే ఊరుకోం.

0 22

 అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో పర్యాటక ప్రాంతంగా రూపాంతరం చెందుతున్న చింతవాని పాలెం వాటర్ ఫాల్స్ ప్రాంతానికి వలస వచ్చేందుకు ప్రయత్నిస్తున్న జీకే వీధి మండలానికి చెందిన రామగడ్డ గిరిజనులకు అప్పగించే ప్రయత్నాలపై అభ్యంతరం తెలియజేస్తూ..చింతవాని పాలెం,జువ్విరేవుల పరిసర ప్రాంత గిరిజనులు సుమారుగా 70 మంది వరకు వచ్చి కొయ్యూరు తాహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేయడం జరిగింది.


వలస పేరుతో రావడానికి ప్రయత్నిస్తున్న జీకే వీధి మండల వాసులకు ఈ ప్రాంతాన్ని అప్పజెప్పితే సహించేది లేదని అన్నారు.

మా యొక్క కొయ్యూరు పంచాయతీ చింతవాని పాలెం గ్రామానికి దగ్గరలో ఉన్న జలపాతం ఇప్పుడిప్పుడే ఎంతో ప్రాచూర్యం పొందుతుందని, ఈ ఒక్క మండలంలోనే, జిల్లాలోనే కాక చుట్టుప్రక్కల జిల్లాల నుండి సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు ఈ జలపాతానికి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణన్ని వీక్షించి ఆస్వాదిస్తున్నారని, ఇటీవల జలపాతం యొక్క మార్గాన్ని ఉపాధి పనుల్లో భాగంగా తయారు చేయడం జరిగిందని, ఇక రేపో మాపో ఈ జలపాతం పర్యాటక ప్రాంతంగా రూపాంతరం చెందుతుందని భావిస్తున్న తరుణంలో గూడెం కొత్త వీధి మండలం, దేవరపల్లి పంచాయతీ, రామగడ్డ గ్రామ గిరిజనులు ఈ జలపాతం పరిసరాలలో వలస పేరుతో మకాం వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుందని, ఈ ప్రయత్నాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని మీడియా ముఖంగా తెలిపారు.

పర్యాటక ప్రాంతంగా రూపాంతరం చెందే సమయంలో ఈ ప్రాంత వాతావరణంలో పోడు వ్యవసాయం పేరుతో నరికివేసి, పర్యావరణాన్ని పాడు చేయడానికి జరుగుతున్న ప్రయత్నం పై తామంతా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

వలస వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారికి బూధరాళ్ళ పంచాయతీలో నివాసం ఉంటున్న కృప అనే వ్యక్తి సహకరిస్తున్నట్లు తెలిసిందని, ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఊరుకునేది లేదని కొయ్యూరు ఎంపీటీసీ మల్లికార్జునరావు హెచ్చరించారు.

వినతి పత్రాన్ని సీనియర్ అసిస్టెంట్ కి,డీ హెచ్ టి కి అందజేశారు.

కొయ్యూరు సర్పంచ్ బాలరాజు,మాకాడ బూరుగులయ్య,లాలం శేఖర్ మరికొంతమంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.