Breaking News

ఎమ్మార్వో బలవన్మరణం దురదృష్టకరం-అరకు ఎంపీ గొడ్డేటి మాధవి

0 21

 పెదబయలు ఎమ్మార్వో బలవన్మరణం దురదృష్టకరం.

ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు.

-అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి 

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలో ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు గురువారం ఉదయం బలవన్మరణానికి పాల్పడిన విషయం.

ఈ సందర్భంగా అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఢిల్లీ నుండి ఫోన్లో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తో మాట్లాడుతూ ఈ కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు.

మరణానికి సంబంధించిన విషయం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పెదబయలు ఎమ్మార్వో మృతదేహం 

ఈ సందర్భంగా మీడియాతో ఎంపీ మాట్లాడుతూ.. ప్రభుత్వ అధికారులకు పని ఒత్తిడి, తదితర అంశాలపై వారి ఉన్నత అధికారులకు తెలపాలే గానీ ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని సూచనలు చేసి, ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు అని, ఇలాంటి తొందరపాటు చర్యలు చేసి కుటుంబ సభ్యులకు కడుపుకోతలు మిగల్చవద్దని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.