Breaking News

పాడి రైతులను ఆదుకోవాలని తెలుగు దేశం నాయకులు డిమాండ్.

0 21

 పాడి రైతులను ఆదుకోవాలని తెలుగు దేశం నాయకులు డిమాండ్.


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం:

 అంతు చిక్కని వ్యాధులతో పశువులు మరణిస్తున్నాయి. పశువుల మరణం తో పాడి రైతులు కు అపార నష్టం వాటిల్లుతుంది. పశువులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించి ముందస్తు వెక్సిన్ లు వేసే దిశగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని తెలుగు దేశం పార్టీ కొయ్యూరు మండల ఉపాధ్యక్షులు ఉల్లి వెంకటేశ్వర్లు అన్నారు.సచివాలయానికి ఒక వెటర్నరీ ఉద్యోగిని ఏర్పాటు చేసిన ప్రభుత్వం పశువులను కాపాడడంలో విఫలం చెందుతుందని,సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకుండా ఎన్ని వ్యవస్థలు తీసుకుని వచ్చినా వ్యర్థమే అని, పశువులు చనిపోతున్నా, పాడి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వానికి చీమ కట్టినట్టు కూడా లేదని, పశువులు మరణించి నష్ట పోయిన రైతులకు తక్షణమే నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని సోషల్ మీడియా ఇంచార్జ్ జంపా వెంకట రమణ డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.