Breaking News

దొంగతనం జరిగిందని ఫిర్యాదు అందిన 24 గంటల్లో దొంగలను పట్టుకున్న కొయ్యూరు పోలీసులు.

0 24

 దొంగతనం జరిగిందని ఫిర్యాదు అందిన 24 గంటల్లో దొంగలను పట్టుకున్న కొయ్యూరు పోలీసులు.


 అనకాపల్లి జిల్లా,నర్సీపట్నంలోని కొత్త వీధికి చెందిన ఎల్లపు గోవిందరావు అనే వ్యక్తి ఏజెన్సీ ప్రాంతంలో కిరాణా వ్యాపారం చేస్తూ ఉంటాడు. అయితే ఈనెల 6వ తారీఖున వ్యాపార నిమిత్తం ఉదయం 6 గంటల ప్రాంతంలో నర్సీపట్నంలో బయలుదేరి, 1,50,000 రూపాయలు పట్టుకొని, అల్లూరి జిల్లా, కొయ్యూరు మండలం లోని డౌనూరు గ్రామం వద్ద తన బైకును ఆపి ఒక టిఫిన్ షాప్ వద్దకు టిఫిన్ చేసేందుకు వెళ్ళగా పెట్రోల్ బంక్ నుండి గోవిందరావును ఫాలో అవుతున్న దొంగలు,కొయ్యూరు మండలంలోని డౌనూరు గ్రామంలో గల మెయిన్ రోడ్డు వద్ద ఒక టిఫిన్ షాప్ వద్ద గోవిందరావు బైక్ ఆపడం చూసి అతని బైక్ యొక్క పెట్రోల్ కవర్ నుండి డబ్బులు గల బ్యాగును దొంగలించి అక్కడి నుండే బైకులు మీద వెళ్ళిపోయారు.

 వెంటనే డబ్బులు పోయాయి అని గ్రహించిన గోవిందరావు చుట్టుపక్కల ప్రాంతాల్లో దొంగల గురించి వెతికాడు.కానీ ఫలితం లేకపోవడంతో తేదీ 9.12.2022 న కొయ్యూరు పోలీస్ స్టేషన్ నందు తన డబ్బులు పోయిన విషయంపై ఫిర్యాదు చేయడంతో కేస్ నమోదు చేయడం జరిగింది. వెంటనే కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి దొంగతనానికి పాల్పడిన నేరస్తులు గురించి వెతకడం ప్రారంభించి నర్సీపట్నం,డౌనూరు మధ్య గల సీసీటీవీ లను అదేవిధంగా అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేయడం జరిగింది. అదేవిధంగా సిసిటీవీలో లభ్యమైన అనుమానితుల ఫోటోలను కేడీపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ కి,నర్సీపట్నం పరిధిలో గల పోలీస్ స్టేషన్ లకు సోషల్ మీడియాలో పంపడం జరిగింది. అయితే దొంగలను కేడీపేట పోలీస్ స్టేషన్ ఎస్.ఐ,కానిస్టేబుల్ దుర్గా ప్రసాద్,కుర్మారావు,ప్రసాద్ ల సహాయంతో దొంగలను కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి నాయుడు, కొయ్యూరు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ రాజారావు,సిబ్బంది  

తేదీ 10.12.2022 న మధ్యాహ్నం సమయంలో కొండ గోకిరి గ్రామ శివారులో పట్టుకోవడం జరిగింది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు కృష్ణాదేవి పేటకు చెందిన గంటా రవీంద్ర అలియాస్ రవి, వడ్డాది మాడుగుల కు చెందిన గంటా భీమరాజు,కొత్తవలసకు చెందిన ఏలియా కుమార్ అని సీఐ తెలిపారు.

దొంగల వద్ద నుండి దర్యాప్తు నిమిత్తం 1,50,000 రూపాయల క్యాష్, నేరం చెయ్యడానికి వాడిన 2 బైక్ లు, 2 మొబైల్ ఫోన్ లు సీజ్ చెయ్యడం జరిగింది. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.