మరోసారి మానవత్వం చాటుకున్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి భర్త నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివ ప్రసాద్ గారు.
10,000 రూపాయలు ఆర్థిక సహాయం,వీల్ చైర్ అందజేత.
అనకాపల్లి జిల్లా,గొలుగొండ మండలం,మల్లంపేట గ్రామానికి చెందిన వెంకటరమణ అనే వ్యక్తి రోజువారి కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు.
ఈ మధ్యకాలంలో కూలి పని నిమిత్తం వెళ్తుంటే క్రషర్ వ్యాన్ ఢీకొట్టడంతో రెండు కాళ్లు పోగొట్టుకోవడం జరిగింది.
వెంకటరమణ యాక్సిడెంట్ కి గురి కావడంతో కుటుంబ పోషణ జరిపే పరిస్థితిలో లేకపోవడంతో ఈ విషయాన్ని నేను సైతం శివప్రసాద్ కి తెలుపగా వారు స్పందించి లవ్ అండ్ కేర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు & వ్యవస్థాపకులు డా”పైడి పాముల యేసు పాదం తో కలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో “యేసు పాదం”చేతుల మీదుగా తన వంతు సహాయంగా 10,000/-రూపాయలు ఆర్థిక సాయం చేసి వీల్ చైర్ అందించడం జరిగింది.
ఈ సందర్భంగా యేసు పాదం.. వెంకటరమణ యొక్క కుటుంబ దీన స్థితిని చూసి చలించి ప్రతి నెల ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పెద్ద మొత్తంలో సేవా కార్యక్రమాలకి కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఆర్థికపరమైన సహకారం అందించడంలో నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్ ముందుంటారని మరోమారు రుజువైందని ప్రజలు కొనియాడుతున్నారు.
ఈ సందర్భంగా వెంకటరమణ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లోకేష్,లారీ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.