Breaking News

దేవుని మాన్యం ఆక్రమణ వెనుక ఉన్నది ఎవరు?

0 19

 దేవుని మాన్యం ఆక్రమణ వెనుక ఉన్నది ఎవరు?

 ఆక్రమణదారునికి కనీసం దేవదాశాఖ అధికారులు నోటిసు ఇవ్వరా?- సిపిఎం సూటిప్రశ్న 


అనకాపల్లి జిల్లా,దేవరాపల్లి మండలం,మారేపల్లి రెవెన్యూ సర్వే నెంబరు 115 లో కోట్లాది రూపాయలు విలువ చేసే 23 ఎకరాల 15 సెంట్లు ఆక్రమణ వెనుక ఉన్నది ఎవరని? ఆక్రమణ దారునికి కనీసం నోటిసులు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో దేవదాశాఖ అధికారులు ఉన్నారా? అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి.వెంకన్న సూటిగా ప్రశ్నించారు.బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేసారు.ఈభూమి సెటిల్ మెంట్ పూర్వం 10 {1} లో ఆవుగడ్డ సఖూరినాయుడు ధర్మకర్తగా ఉన్నారని,1956 లో భూమి సెటిల్ మెంట్ అయిన తరువాత మారేపల్లి శ్రీ రాములు వారి పేరున నమోదు అయ్యి ఉందన్నారు. దీన్ని తారువా గ్రామానికి చెందిన వ్యక్తులకు ఏవిధంగా దాఖలు పడిందని ప్రశ్నించారు.ఈభూమి ఆక్రమణకు గురైయిందని,దీనిపై ఆక్రమణ దారునికి ఎటువంటి అధికారులు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎండోమెంటు ట్రిబ్యునల్ కు వెళ్ళాలని,భూములు అమ్మిన వ్యక్తులు కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎటువంటి పాస్ బుక్కులు ఇవ్వరాదని స్పష్టం చేస్తూ గతంలో ఉన్న అనకాపల్లి దేవదాశాఖ అసిస్టెంటు కమీషనర్ తేదీ 14/6/2022,న దేవరాపల్లి తహశీల్దార్ కి వ్రాయడం జరిగిందన్నారు. దీని ఆధారంగా తహశీల్దార్ రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇప్పటికి మూడు సార్లు పాస్ బుక్కులు తిర్కరించారని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ ఎండోమెంటు చట్టం లోని సెక్షన్ 81ప్రకారం ఏదైనా మతపరమైన స్థిరాస్తి అమ్మకం లేదా ఆక్రమణ చెల్లదన్నారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫుల్ బెంచ్ రిఫరెన లో ఉదహరించిన తీర్పులో ధార్మిక,మతపరమైన ఎండోమెంటు యొక్క స్థిరమైన ఆస్తులు, సెక్షన్ 43 ప్రకారం ఆక్రమణదారునికి హక్కులు ఉంటే ఎండోమెంటు యాజమాన్యంను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్ళాలని అట్లు చేయని ఎడల ఆక్రమణదారునికి ఎటువంటి హక్కులు ఉండవన్నారు. ఎండోమెంటు పాత సెక్షన్ 38/25 రిజిస్టర్లు ప్రకారం కూడా ఒక్కసారి రెవెన్యూ సెటిల్ మెంట్ పేయిర్ అడంగల్ లో మతపరమైన ఆస్తిగా రికార్డుల్లో నమోదు అయితే అది ఎండోమెంటు భూమి క్రిందనే ఉంటుందని వెంకన్న స్పష్టం చేశారు.దీని ప్రకారం భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి తేదీ 12/9/2022 న ఫిర్యాదు చేయడంతో పాటు ఉమ్మడి జిల్లా అసిస్టెంటు కమీషనర్ విశాఖపట్నం,అనకాపల్లి జిల్లా అసిస్టెంట్ కమీషనర్ కు పలుమార్లు ఫిర్యాదులు చేయడం జరిగిందని తెలిపారు.స్పందనలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విలువ లేదన్నారు. కనీసం ఎండార్సు మెంట్ అయినా ఇవ్వడం లేదన్నారు.రెవెన్యూ అధికారులు ఇది దేవుని మాన్యమని గతంలో ఆక్రమణ దారునికి ఇచ్చిన పాస్ బుక్కులు రద్దుచేయాలని ఎండోమెంటు అధికారులు, సంబంధించిన రెవెన్యూ అధికారులకు ధరఖాస్తు పెట్టాలని పరోక్షంగా తెలియజేసిన, ఇకపై రియల్ ఎస్టేట్ వ్యారికి పాస్ బుక్ ఇవ్వబడవని,మూడు సార్లు తిరస్కరించిన దేవదాశాఖ అధికారులు తీరు మాత్రం చెవిటివానికి శంఖం ఊదినట్లు ఉందన్నారు.వెంటనే ఆక్రమణ దారుని నుండి భూమిని స్వాధీనం చేసుకోవాలని దేవదాయ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని రాజకీయ వత్తిళ్ళుకు చరమగీతం పాడాలని వెంకన్న డిమాండ్ చేసారు.ఈయన వెంట సిపిఎం మండల కార్యదర్శి బిటి దొర ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.