Breaking News

సచివాలయ కన్వీనర్లు,గ్రామ వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి:ఎమ్మెల్యే,ఎంపీ

0 22

 అల్లూరి జిల్లా,కొయ్యూరు మండల కేంద్రంలోని అల్లూరి కళామందిరంలో సచివాలయ కన్వీనర్లు,గ్రామ వాలంటీర్లతో వైసిపి పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది.


ఈ సమావేశంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు నియోజకవర్గ పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో వీరు మాట్లాడుతూ గ్రామ వాలంటీర్లు సచివాలయ కన్వీనర్లు సమన్వయంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా వైసిపి ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాలని,పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్,జడ్పీటీసీ వారా నూకరాజు, పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు,ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ,వైస్ ఎంపీపీ లు వెంకటరమణ,నూకాలమ్మ,బీసీ డైరెక్టర్ గాడి నాగమణి,డౌనూరు ఎంపీటీసీ బిడిజన అప్పారావు,ఎం.మాకవరం ఎంపీటీసీ పొడుగు రత్నం,గాడి సత్యనారాయణ, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముసిలి నాయుడు,రీమల గంగాధర్,తదితర ఎంపీటీసీలు, సర్పంచులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.