Breaking News

కొయ్యూరు:విద్యార్థినిలకు ట్యాబ్ లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ,ఎమ్మెల్యే

0 22

 8వ తరగతి విద్యార్థినిలు ట్యాబ్ లు పంపిణీ చేసిన ఎంపీ,ఎమ్మెల్యే.

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం లోని బాలికల ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థిని లకు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ట్యాబ్ లు పంపిణీ చేశారు.


ఈ పోటీ ప్రపంచంలో బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలనే సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చదువుకై అనేక మార్పులు తీసుకువస్తున్నారని, అందులో భాగంగానే నాడు నేడు ద్వారా అనేక పాఠశాలల రూపు మారిందని,అలాగే ప్రతీ విద్యార్ధికి ఇప్పుడు ట్యాబులు పంపిణీ చేయడం జరుగుతుందని, విద్యార్థినిలు చదువుకునేందుకు వీలుగా బై జ్యూస్ యాప్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంటుందని ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు.

ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,బాగా చదవాలని ఎంపీ,ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ట్యాబులు పంపిణీ అనంతరం పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ మా యొక్క భవిష్యత్తు దృష్ట్యా ట్యాబులు పంపిణీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి కి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవికి విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాడేరు నియోజకవర్గ పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు,కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్, జెడ్పిటిసి వారా నూకరాజు,పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు,మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జైతి రాజులమ్మ, వైస్ ఎంపీపీలు వెంకటరమణ, నూకాలమ్మ, గాడి సత్యనారాయణ, డౌనూరు ఎంపీటీసీ బిడిజన అప్పారావు,ఎం.మాకవరం సర్పంచ్ చింతల్లి,రాజుబాబు,అంతాడ సర్పంచ్ సుర్ల చంద్రరావు,శరభన్న పాలెం సర్పంచ్ సత్యనారాయణ,వెలగలపాలెం సర్పంచ్,అలాగే నాయకులు దోని బాబ్జీ,శేఖర్,సురేష్ పట్నాయక్,ఉల్లి రామూర్తి తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.