Breaking News

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి క్షేత్రస్థాయిలో వివరించాలి-అరకు ఎంపీ

0 20

 ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి క్షేత్రస్థాయిలో వివరించాలి.

-అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.


అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు నియోజకవర్గం,చింతపల్లి మండలం,కిన్నెర్ర గ్రామం నందు గ్రామ సచివాలయ మండల కన్వీనర్లు,వాలంటీర్లు,సచివాలయ సిబ్బందితో వైసిపి మండల అధ్యక్షుడు మోరి రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాడేరు పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు తో కలిసి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి.

ఈ సందర్భంగా అరకు ఎంపీ మాట్లాడుతూ…

జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు మండల కన్వీనర్లు,వాలంటీర్లు,నాయకులతో కలిసి సమన్వయం చేసుకొని వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు.


గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టి నేటితో 100 రోజులు పూర్తయిన శుభసందర్భంగా కేక్ కటింగ్ చేసి,స్థానిక శాసన సభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి కి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎంపీ కి దుస్సాలువతో సన్మానించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పోతురాజు బాలయ్య పడాల్,ఎంపీపీ అనూషా దేవి,వైస్ ఎంపీపీలు,సర్పంచ్లు,ఎంపీటీసీలు,కన్వీనర్లు,వాలంటీర్లు,స్థానిక ప్రజా ప్రతినిధులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.