మరో ఫిల్మ్ ఫెస్టివల్ లో సత్తా చాటిన కొమ్మిక యువకుడు.
మహారాష్ట్ర, చత్రపతి సంభాజీ నగర్ ఔరంగబాదులోని మౌలానా ఆజాద్ పరిశోధన కేంద్రం లో ఆసియన్ టాలెంట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. వివిధ చిత్రాలు స్క్రీనింగ్ అనంతరం సోమవారం బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. దానిలో భాగంగా అల్లూరి జిల్లా కొయ్యూరు మండలానికి చెందిన కొమ్మిక యువకుడు చిత్రీకరించిన రెండు లఘు చిత్రాలకు అవార్డులు లభించాయి. ఉత్తమ తెలుగు లఘు చిత్రంగా ” మీ చూపులే ” , స్పెషల్ జ్యూరీ పురస్కారం ” పి ఆర్ ఎన్ ” కైవసం చేసుకున్నాయి.
మొత్తం మూడు అవార్డులు
ఉత్తమ తెలుగు లఘు చిత్రం – P or N
ఉత్తమ లఘు చిత్రం – మీ చూపులే
టాప్ 5 లఘు చిత్రాలు – P or N
ఫెస్టివల్ డైరెక్టర్ రాజు కుంబ్లే చేతుల మీదుగా యన్ వెంకట్ రాఘవ అవార్డులు అందుకున్నారు. ఫెస్టివల్ నిర్వాహకులు తుషార్ తోరట్ మాట్లాడుతూ, అతి తక్కువ సమయంలో ” మీ చూపులే ” లఘు చిత్రం చిత్రీకరణ పూర్తి చేసినందుకు ప్రశంసించారు. కొత్త ఆలోచనలతో, వేగంగా చిత్రీకరణ చేయటమే కాక అందరినీ ఆకట్టుకునేలా అధ్భుతంగా చూపించటం చాలా గొప్ప విషయమని, ఇలాంటి యువ దర్శకులు మరింత మంది సినీ పరిశ్రమ వైపు నిలబడి భారతీయ సినిమా పరిశ్రమను మరింత మెరుగు పరచాలని ఆశా భావం వ్యక్తం చేశారు. ఎన్నో అద్భుతమైన చిత్రాలు ప్రాంతీయ భాషలకే పరిమితమవుతున్నాయని, వాటిని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయాలని ఆయన కోరారు..గత కొద్ది కాలంగా సౌత్ దర్శకుల ప్రతిభ భారత దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో అలరిస్తుందో అందరం చూస్తున్నాం.. అదే విధంగా ఇలాంటి యువ దర్శకులు ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సినిమాకు తగిన గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలని అన్నారు..
యన్ వెంకట్ రాఘవ మాట్లాడుతూ అవార్డులు అందుకున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. ముందు ముందు మరిన్ని మంచి చిత్రాలతో మీ ముందుకు వస్తానని తెలిపారు. నా ఈ విజయం వెనుక మా టీం అందరి కృషి ఉంది.. ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు, మరాఠీ చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు.