జీకేవీధి మండలంలో నూతన పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో కలిసి పాల్గొన్న ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ.
అల్లూరి సీతారామరాజు జిల్లా,జీకేవీధి మండలం:
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ మాట్లాడుతూ జగనన్న ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ దార్లకు పింఛన్ పెంచుకుంటూ వెళ్తున్నారని,2500 రూపాయలు ఉన్న పింఛను 2750రూపాయలు పెంచారని,వచ్చే సంవత్సరం మరో 250రూపాయలు పెంచి 3000రూపాయలు పెంచి పింఛను ఇవ్వడం జరుగుతుందని,ఇచ్చిన మాట తూచా తప్పకుండా నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మనమంతా ఎప్పుడూ ఋణపడి ఉండాలని, మళ్లీ ఆయననే ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ అన్నారు.
అలాగే తనను ఏఎంసీ చైర్ పర్సన్ గా ఈ స్థానంలో కూర్చోబెట్టిన ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి కి కృతజ్ఞతలు తెలిపారు.