గంగవరం నుంచి పాడేరుకు బస్ సర్వీస్ ను పున: ప్రారంభించిన పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి.
అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలం లోని గంగవరం నుంచి పాడేరుకు బస్ సర్వీసులు పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి శుక్రవారం పునః ప్రారంభించారు. ఈ సర్వీస్ గతంలో నడిచేదని అనివార్య కారణాల వల్ల ఏపీఎస్ఆర్టీసీ రద్దు చేసిందని, తమకు మరల బస్ సర్వీస్ ను పునరుద్ధరించాలని పాడేరు శాసనసభ్యులు భాగ్యలక్ష్మికి అక్కడి వారంతా పలుమార్లు విన్నవించారు. ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి సంప్రదించి బస్ సర్వీస్ పునః ప్రారంభానికి చర్యలు తీసుకున్నారు. దీనికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు సమ్మతించి శుక్రవారం నుంచి సర్వీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బడుగు రమేష్ బాబు, జెడ్పిటిసి వారా నూకరాజు, చింతపల్లి జడ్పిటిసి పోతురాజు బాలయ్య పడాల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జల్లి బాబులు,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జైతి రాజులమ్మ,బీసీ డైరెక్టర్ గాడి నాగమణి,వైస్ ఎంపీపీలు అప్పన వెంకటరమణ, నూకాలమ్మ,సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రేగం ముసలి నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గాడి సత్యనారాయణ, బండి సుధాకర్,సావిత్రి, గంగాధర్,రవి,శేఖర్,ప్రసాద్, సూరిబాబు,సురేష్,పోతురాజు, నీలాపు సూరి,సర్పంచులు శోభన్, శ్రీను,పొట్టిక భవాని,చందు,పడాల్, ఎంపిటిసిలు,నాయకులు, తదితర సర్పంచులు పాల్గొన్నారు.