Breaking News

జీకే వీధి:ఏఎంసీ చైర్ పర్సన్,డైరెక్టర్ లకు వైస్ ఎంపీపీ సన్మానం.

0 30

 జీకే వీధి:ఏఎంసీ చైర్ పర్సన్,డైరెక్టర్ లకు వైస్ ఎంపీపీ సన్మానం.


AG NEWS 24×7 ప్రతినిధి:సునీల్ ప్రసాద్

అల్లూరి సీతారామరాజు జిల్లా,జీకే వీధి మండల వైస్ ఎంపీపీ సప్పగెడ్డ ఆనందరావు ఇంటికి ఈరోజు ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ,ఏఎంసీ డైరెక్టర్ పీ.అచ్యుత్ కలిసి పలకరించేందుకు వెళ్ళడం జరిగింది.


వైస్ ఎంపీపీ ఇంటికి ఏఎంసీ చైర్ పర్సన్ విచ్చేసిన విషయం తెలుసుకున్న కొంతమంది వైసీపీ పార్టీ నేతలు అక్కడికి వచ్చి పరిచయ కార్యక్రమం జరిగింది.2024 లో వైసీపీ జెండా మరల ఈ నియోజకవర్గంలో ఎగిరేందుకు ఇప్పటి నుండే కష్టపడి పనిచేయాలని చర్చించుకోవడం జరిగింది.

అనంతరం ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ కు,ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్ కి వైస్ ఎంపీపీ సప్పగెడ్డ ఆనందరావు,కుమారి దంపతుల ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ నేతలు వైస్ సర్పంచ్ కుమారి,పెదవలస పంచాయితీ కన్వీనర్ రమేష్, నాయకులు ఆనంద్,వార్డు మెంబర్ త్రినాథ్,రామారావు,శివాజీ మరికొంతమంది పాల్గొని దుశాలువాలతో సన్మానించారు.

Leave A Reply

Your email address will not be published.