Breaking News

మీ వెంటే ఉంటాం..కష్టాల్లో తోడుంటాం..అంటున్న అరకు ఎంపి మాధవి శివప్రసాద్ దంపతులు.

0 17

మీ వెంటే ఉంటాం..కష్టాల్లో తోడుంటాం..అంటున్న అరకు ఎంపి మాధవి శివప్రసాద్ దంపతులు.


అల్లూరి సీతారామరాజు జిల్లా,

కొయ్యూరు: ఇటీవల తీవ్ర అనారోగ్యంనకు గురైన శరభన్నపాలెం ఎంపీటీసీకి హాస్పిటల్లో స్వయంగా చేర్చి తన ఆరోగ్యం మెరుగు పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటమేకాక అతని కుటుంబానికి ఆసరాగా 15వేలు ఆర్థిక సహాయం అందించి వారి ఔదార్యం చాటుకున్నారు అరకు పార్లమెంట్ సభ్యులు మాధవి శివప్రసాద్ దంపతులు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం శరభన్నపాలెం సెగ్మెంట్ ఎంపీటీసీ లోకుల సోమగాంధీ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విషయం తెలుసుకున్న అరకు ఎంపి మాధవి,భర్త నేను సైతం ట్రస్ట్ చైర్మన్ శివప్రసాద్ లు స్పందించి తక్షణమే నర్సీపట్నం నుంచి విశాఖ తరలించి వైద్యం అందించారు. ఆయన ఆరోగ్యం కుదుట పడిన అనంతరం ఎంపి ఆదేశాలపై ఆయనను విశాఖ హాస్పిటల్ కు వెళ్లిన భర్త శివప్రసాద్ ఆయన్ని పరామర్శించి ఆర్థిక సహాయంగా 15వేల రూపాయలు అందించారు.స్వగ్రామం శరభన్నపాలెం తరలించుటకు తగిన వాహనం ఏర్పాటుచేశారు.ఎంపీటీసీకే కాదు!పార్టీలకు అతీతంగా ప్రజలకు ఎల్లప్పుడూ తోడుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం చేస్తున్న ఎంపి మాధవి శివప్రసాద్ దంపతులు ప్రజలకు కష్టాల్లో తోడుగా, నీడగా ఉన్నందుకు ఎంపీటీసీ సోమగాంధీ వారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.