Breaking News

బాషా వాలంటీర్లు విధుల్లోకి చేరేందుకు ప్రభుత్వం అనుమతి.

0 25

 బాషా వాలంటీర్లు విధుల్లోకి చేరేందుకు ప్రభుత్వం అనుమతి.


 రెండేళ్ల నిరక్షణకు తెర.


అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి ప్రత్యేక చొరవతో ఆదివాసి మాతృభాషా విద్యా వాలంటీర్లు విధుల్లో..


 అరకు ఎంపీ గొడ్డేటి మాధవి పలు సందర్భాల్లో ఆదివాసి మాతృభాషా వాలంటీర్లకు చెల్లించాల్సిన బకాయిలు,బాషా వాలంటీర్లను కొనసాగించాల్సిన ఆవశ్యకత గురించి,పార్లమెంట్ సభా ప్రాంగణంలో లోక్ సభ స్పీకర్ ద్వారా అలాగే వేరువేరు సందర్భాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని,కేంద్ర విద్యాశాఖ,గిరిజన సంక్షేమ శాఖ మంత్రుల వద్ద ప్రస్తావించి,వినతి పత్రాలు ఇచ్చిన విషయం విధితమే.


అయితే వారిని విధుల్లోకి చేరాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మౌలిక ఆదేశాలు వచ్చిన విషయం తెలిసిందే.


అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి విన్నపానికి స్పందించిన ఏపీ సీఎం,కేంద్ర మంత్రులు,బాషా వాలంటీర్లు విధుల్లోకి చేరాలని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.


ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఆదివాసీ మాతృభాషా విద్యా వాలంటీర్ల ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించి రెండు సంవత్సరాల తర్వాత అయినా విధుల్లోకి భాషా వాలంటీర్లను రెన్యువల్ చేయడంతో గిరిజన విద్యార్థుల విద్య అభ్యున్నతికి ఇది శుభ పరిణామం అని,నా జీవితంలో ఇదో గొప్ప విజయమని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.