Breaking News

తిరుపతి దేవస్థానంలో పెంచిన రేట్లను తగ్గించాలి: బీజేపీ

0 21

తిరుపతి దేవస్థానంలో పెంచిన రేట్లను తగ్గించాలి.


అల్లూరి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిరసన. 


అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు:హిందూ దేవాలయాలపై వైసీపీ ప్రభుత్వం ఆగడాలు అరికట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు పాంగి రాజారావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కురుస ఉమా మహేశ్వరరావు,కేంద్ర కాఫీ బోర్డు సభ్యులు కురుస ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ తిరుపతి దేవస్థానంలో విపరీతంగా పెంచిన వసతి గదుల రేట్లు తగ్గించాలని,శ్రీశైలం దేవస్థానంలో జరుగుతున్న అవినీతిని అరికట్టాలని,హిందూ దేవాలయాలకు వచ్చిన ఆదాయం హిందూ కార్యక్రమాలకే ఉయోగించాలని అన్నారు.


అనంతరం కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారికి బీజేపీ ఆధ్వర్యంలో మెమోరాండం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సోమేలి శాంత కుమారి, ఎస్టీ మోర్చా రాష్ట్ర నాయకులు కురుస రాజారావు,బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు సల్ల రామకృష్ణ, కే రాఘవేంద్ర రావు, జిల్లా ఉపాధ్యక్షులు శరభ వేమన్న, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు లకే భాస్కర్ రావు,బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందోలి ఉమా మహేష్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు పాంగి మత్స్య కొండ బాబు,మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు తాంగుల సత్యవతి, ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకర చిన్నయ్య,బీజేవైఎం పాడేరు మండల అధ్యక్షులు పాంగి సూర్య ప్రకాష్,బీజేపీ జిల్లా కోశాధికారి కొర్ర ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.