Breaking News

కోడిపందాలు,పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు:జీకేవీధి సీఐ,ఎస్ఐ.

0 20

 కోడిపందాలు,పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు:జీకేవీధి సీఐ,ఎస్ఐ.


AG NEWS 24×7 ప్రతినిధి: సునీల్ ప్రసాద్.

ప్రతి ఒక్కరూ సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుకోవాలని ఆశిస్తూ…

ముందుగా గూడెం కొత్తవీధి మండల ప్రజానీకానికి సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ కె.అప్పలసూరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు,పేకాటలు ఆడొద్దని మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగించే వాలీబాల్ క్రికెట్ వంటి సాంప్రదాయక క్రీడలను ఆడాలని వాలీబాల్ కిట్లు పంపిణీ చేసారు. 

  పేకాటలు,కోడిపందాలు వంటివి ఆడి చాలామంది తమకున్న ఆస్తులు,కోళ్లు,మేకలను అమ్ముకుంటున్నారని కానీ ఎవరూ వాటి జోలికి వెళ్లొద్దని హెచ్చరించారు. ఆడే వారిపై,స్థావరాలు ఏర్పాటు చేసిన వారిపై నిఘా ఉంచి దాడులు నిర్వహించి చట్టపరమైన కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. 

      అదేవిధంగా స్కూల్ నుంచి హాస్టల్ నుంచి వచ్చిన పిల్లలకు మైనర్లకు బైకులను ఇవ్వ వద్దని, ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ నెమ్మదిగా, సురక్షితంగా ప్రయాణించి గమ్యస్థానాలు చేరుకోవాలని కోరారు. 

పండుగ సరదాలు సంతోషాలతో నిండాలే తప్ప విషాదాలతో ఉండకూడదని ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.