Breaking News

జీకే వీధి:ఈనెల 20,21 తేదీల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం

0 21

 జీకే వీధి:ఈనెల 20,21 తేదీల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 

లక్ష్మణ్ (మండల పార్టీ అధ్యక్షుడు)

AG NEWS 24×7 ప్రతినిధి: సునీల్ ప్రసాద్.

 అల్లూరి సీతారామరాజు జిల్లా,జీకే వీధి మండలం,పెదవలస సచివాలయం పరిధిలో ఈనెల 20, 21 తేదీల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి హాజరవుతున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్,వైస్ ఎంపీపీ సప్పగెడ్డ ఆనందరావు, స్థానిక పంచాయితీ సర్పంచ్ కృష్ణవంశీ,పీఎసీఎస్ చైర్మన్ ప్రసాద్ తెలిపారు.

వైస్ ఎంపీపీ సప్పగెడ్డ ఆనందరావు 

ఈ కార్యక్రమంలో భాగంగా 20వ తేదీన ఉదయం 10:00 గంటలకు గూడెం కొత్త వీధి మండలం,పెదవలస గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రంపులు టెంట్లవీధి,రంపులు చెరువీధి,స్కూల్ వీధి, తియ్యమామిడి వీధి.కొక్కితపాడు, పెద్దలంక,డోకులూరు,బంధవీధి,చాపరాతిపాలెం ఈ గ్రామాల్లో మొదటి రోజు పర్యటించనున్నారని,

కృష్ణవంశీ (సర్పంచ్)

రెండవ రోజు 21వ తేదీన ఉదయం 10:00 గంటలకు పెదవలసలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం ప్రారంభోత్సవం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి చేతులమీదుగా జరగనుందని

ప్రసాద్ (పీఎసీఎస్ చైర్మన్)

కనుక ఈ కార్యక్రమానికి మండల నాయకులు, జడ్పీటీసీ కిముడు శివరత్నం,ఎంపీపీ బోయిని కుమారి,వైఎస్ ఎంపీపీ దేముడు,మూడు మండలాల ఉమ్మడి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు జైతి రాజులమ్మ,డైరెక్టర్ లు,మండలంలో ఇతర నామినేటెడ్ పదవులలో ఉన్న వివిధ శాఖల చైర్మన్ లు, మండల పరిధిలో ఉన్న 16 గ్రామ పంచాయతీల ఎంపీటీసీలు, సర్పంచులు,వార్డు మెంబర్లు, సచివాలయం కన్వీనర్స్,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.