Breaking News

కొయ్యూరు:ఘనంగా ఎన్ టి ఆర్ 27వ వర్ధంతి వేడుకలు.

0 21

 కొయ్యూరు:ఘనంగా ఎన్ టి ఆర్ 27వ వర్ధంతి వేడుకలు.


అల్లూరి జిల్లా,కొయ్యూరు మండల కేంద్రం రాజేద్రపాలెంలో పాడేరు అసెంబ్లీ టి ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి అనిశెట్టి చిరంజీవి అధ్యక్షతన స్వర్గీయ నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు,పార్టీ శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.


అనంతరం సభను ఉద్దేశించి టి ఎన్ టి యు సి అరకు పార్లమెంట్ కార్యదర్శి మాకాడ బూరుగులయ్య మాట్లాడుతూ ఎన్ టి రామారావు పార్టీ పెట్టి 1983సం”లో రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించి,నిరుపేదల కోసం కిలో రెండు రూపాయలు బియ్యం ఇచ్చిన ఘనత,సంక్షేమ పథకాలు రాష్ట్రంలో తెచ్చిన ఘనత ఎన్ టీ ఆర్ దేనని,రాజకీయాలే కాకుండా సినీ పరిశ్రమలో కూడా నెంబర్ వన్ హీరోగా ప్రజలను మెప్పించిన విశ్వవిఖ్యాత,నట సార్వభౌముడు గా నందమూరి తారక రామారావు ఎదిగారని, అటువంటి వ్యక్తిని స్మరించుకోవడం మన అదృష్టం అని అన్నారు.ఆయన స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం చిరంజీవి పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాజేంద్రపాలెం సర్పంచ్ పీఠ సింహాచలం,మొట్టడం అశోక్,ఖాన్, ఐటిడిపి కురుజు శ్రీను, మేడిబోన.చిన్న,పల్లాల అబ్బాయిరెడ్డి,రేవళ్లు సర్పంచ్ జె.వెంకటలక్ష్మి,
జెవి రమణ,బాచి,ఉబ్బల.రాజేష్, అనిశెట్టి నాగేశ్వరరావు,మొట్టడం అబ్బాయి దొర, కొట్టేడి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.