పెదబయలు:కిముడుపల్లిలో ఘనంగా బారీజాం పండుగ.
విశాఖ మన్యం(అల్లూరి జిల్లా) మారుమూల ప్రాంతం పెదబయలు మండలం కిముడుపల్లి గ్రామంలో భారీజాం పండుగ ఘనంగా నిర్వహించారు. మూడు సంవత్సరాలకు ఒక్కసారి భారీజాం పండగా ఏర్పాటు చేస్తారు.
గ్రామంలో కొలువైన 148 మంది దేవుళ్లుకు భారీజం పండగ గ్రామ సావడి వద్ద సింగటి పాట పాడుతూ పూర్వీకుల ఆయుధాలకు పూజలు నిర్వహించి ప్రదర్శన చేసి సావాడి లో ఆయుధాలతో విన్యాసాలు చేశారు. గిరిజన సంప్రదాయ పద్ధతిలో గుమ్మలాట, దింస్సా, భజన అనేక రకాలుగా సాంస్కృతిక కార్యక్రమం సావాడి లో ప్రత్యేక వేషాలుతో ప్రదర్శన చేశారు.వారికి ప్రధమ బహుమతి, రెండవ బహుమతి, మూడొవ బహుమతి గండేరు నిరీక్షణ రావు ఆర్థిక సహాయంతో గ్రామ ఉద్యోగులు అధ్వర్యంలో బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో కొడా సింహాద్రి,గండేరు రంగరావు,కొడా కృష్ణమూర్తి,చింతాడ శ్రీరామ్మూర్తి,కోడా వరహానంధం,కిముడు శివలింగం నాయుడు,అంగనైని ఆనంద్,గుడి పూజార్లు నీలకంఠ,సత్యనారాయణ, వెంకట రమణ,యుత్ కమిటీ సభ్యులు లకే సత్యనారాయణ,దివాకర్, ఓండ్రు రాంగోపాల్ పంచాయతీ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.