ఈనెల 20న శ్రీ చింతాలమ్మ తల్లి గుడి ప్రాంగణంలో అభయాంజనేయ,షిర్డీ సాయిబాబా విగ్రహ ప్రతిష్ట.
కాకురు లక్ష్మి (సర్పంచ్) |
రేపు 20వ తేదీ ఉదయం 10 గంటలకు అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలం లోని శ్రీ చింతాలమ్మ తల్లి ఘాట్ వద్ద శ్రీ సద్గురు సేవాశ్రమం భీమిలి సాయిరాం స్వామీజీ వారిచే శ్రీ అభయ ఆంజనేయ స్వామి,శ్రీ షిర్డీ సాయినాధుని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని స్థానిక రావణా పల్లి సర్పంచ్ కాకురు లక్ష్మి తెలిపారు.
కొయ్యూరు,చింతపల్లి,గూడెం కొత్త వీధి మండలాల నుండి గిరిజన పూజారులు భక్తులు అందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆమె కోరారు.శ్రీ సద్గురు సేవాశ్రమం భీమిలి సాయిరాం స్వామీజీ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్,సమరసతా సేవా ఫౌండేషన్ అలాగే వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు తప్పకుండా హాజరు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అన్నసమారాధన కొరకు సహయ సహకారాలు అందిస్తున్న మాజీ జీసీసీ చైర్మన్,టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీవీ ప్రసాద్ కి,సాయి రమణ మెడికల్స్ కృష్ణాదేవిపేట వారికి రావణాపల్లి సర్పంచ్ కాకురు లక్ష్మి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
అలాగే రావణా పల్లి సెగ్మెంట్ పరిధిలోని సర్పంచ్ లు,వార్డు మెంబర్లు,గ్రామ పెద్దలు, మహిళలు,యువత,ఉద్యోగస్తులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఈకార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు.