Breaking News

కొయ్యూరు:3000లీటర్లు బెల్లం పులుపు,20 లీటర్ల నాటుసారా ధ్వంసం చేసిన పోలీసులు.

0 22

 నాటుసారా స్థావరాలపై దాడి – 3000 లీటర్ల బెల్లం పులుపు,20 లీటర్ల నాటుసారా ధ్వంసం.


 ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా నాటుసారా స్థావరాలు పై కొయ్యూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు మహిళ పోలీసులు దాడులు నిర్వహించి మూడు వేల లీటర్ల బెల్లం పులుపును, 20 లీటర్ల నాటు సారా ధ్వంసం చేశారు. నాటు సారా నిర్మూలన చర్యల్లో భాగంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేర కొయ్యూరు సీఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో కొయ్యూరు ఎస్సై రాజారావు సిబ్బంది ఏపీఎస్పీ,మహిళా పోలీసులతో కలిసి నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు.మండలంలోని సురేంద్రపాలెం గ్రామ శివారులో నాటుసారా తయారీ క్రయవిక్రయాలు జరుగుతున్నాయన్న  ముందస్తు సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 3 వేల లీటర్ల బెల్లం పులుపును వంట సామాగ్రిని డ్రమ్ములను ధ్వంసం చేశారు. అనంతరం ఆయా గ్రామాల గిరిజనులతో సమావేశమైన పోలీసులు నాటుసారా వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించారు. నాటు సారా తయారీ క్రయవిక్రయాలు చట్ట వ్యతిరేకమని అటువంటి చర్యలకు ఎవరు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆక్ట్ ప్రకారం ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించబడునని సిఐ స్వామినాయుడు ఎస్సై రాజారావు ప్రజలకు తెలిపారు. ఇకపై నాటుసారా తయారీ క్రయవిక్రయాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని, అటువంటివారు పద్ధతి మార్చుకోవాలని  హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.