Breaking News

కొయ్యూరు:రెవెన్యూ సిబ్బంది తప్పుడు సర్వే చేయడం బాధాకరం.

0 22

 మరణించిన వ్యక్తిని స్మశాన వాటికకు తీసుకువెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న పాత బాలారం గ్రామస్తులు.

పాత బాలారం గ్రామస్తులు 

వివరాలు చూసినట్లయితే అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం బాలారం సచివాలయం పరిధిలోని పాత బాలారం గ్రామంలో..

కంటారం గ్రామానికి చెందిన గిరిజనేతరుడైన బండారు నూకి నాయుడు కి చెందిన పామాయిల్ తోట ఉంది.

అయితే గ్రామంలో ఎవరైనా మరణించినట్లయితే స్మశాన వాటికకు వెళ్లాలంటే పామాయిల్ తోట ద్వారానే వెళ్లాలి.

ఆ భూమి మొత్తం తనదేనని బండారు నూకి నాయుడు పామాయిల్ తోట చుట్టూ ఫెన్సింగ్ కంచెను ఏర్పాటు చేశారు.

దీంతో ఎవరైనా మరణించినట్లయితే ఆ వ్యక్తికి దహన కార్యక్రమాలు చేసేందుకు స్మశాన వాటికకు వెళ్లాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.

అయితే స్మశాన వాటికకు దారి కావాలని సుమారుగా ఆరు నెలల క్రితం కొయ్యూరు తాహశీల్దార్ వారికి ఆ గ్రామస్తులు కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

వెంటనే స్పందించిన ఎమ్మార్వో తిరుమలరావు తమ సిబ్బంది అయిన ఆర్ఐ, విఆర్ఓ, మండల సర్వేయర్, గ్రామ సచివాలయ సర్వేయర్ లను పంపించడం జరిగిందని,

కాలువా పోరంబోకు భూమి 30మీటర్లు స్థలం 


సర్వే చేసేందుకు వచ్చిన ఆర్ఐ రాజన్నదొర,మండల సర్వేయర్ సత్యనారాయణ కలిసి సర్వే చేసి పామాయిల్ తోటకు ఆనుకుని ఉన్న కాలువా పోరంబోకు భూమి 30మీటర్లు ఉందని,ఆర్ఐ రాజన్నదొర సమక్షంలో స్వయంగా బండారు నూకి నాయుడు వేసిన ఫెన్సింగ్ కంచెను తొలగించి,ఆగష్టు నెలలో కర్రలు కూడా పాతించి,ఆ పామాయిల్ తోట కూడా ప్రభుత్వ భూమిలో ఉందని గ్రామస్తులకు తెలియపరచడం జరిగిందని తెలిపారు.

ఫెన్సింగ్ తొలగిస్తున్న ఆర్ఐ,వీఆర్ఏ

అయితే ఆరు నెలలు తర్వాత మళ్లీ అదే మండల సర్వేయర్ సత్యనారాయణ,వేరొక ఆర్ఐ బాలరాజు దొర.. నర్సీపట్నం కి చెందిన ప్రైవేట్ సర్వేయర్ లతో కలిసి వారం క్రితం వచ్చి మళ్ళీ సర్వే చేసి ఫెన్సింగ్ కంచెకు దగ్గరలో ఉందని కొంత మాత్రమే కాలువా పోరంబోకు భూమి ఉందని అంటున్నారని గ్రామస్తులు తెలిపారు.

వారం క్రితం ఆర్ఐ,మండల సర్వేయర్,వీఆర్వో 


ముందు సర్వే చేసినప్పుడు 30మీటర్లు కాలువా పోరంబోకు భూమి ఉందని చెప్పిన రెవెన్యూ సిబ్బంది,ఇప్పుడు మళ్ళీ ఆరు నెలల తర్వాత వచ్చి ఫెన్సింగ్ కి దగ్గరలో రెండు,మూడు మీటర్లు ఉందని ఎలా చెప్తారని అంటున్నారు.

ఇదంతా మండల సర్వేయర్ సత్యనారాయణ కావాలనే ఇలా తప్పుడు సర్వేలు చేసి చెప్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

అయితే ఇంతకుముందు ఆరు నెలల క్రితం సర్వే చేసిన ఆర్ఐ రాజన్న దొర, మండల సర్వేయర్ సత్యనారాయణ,సచివాలయ సర్వేయర్ చంద్రావతి లను వివరణ అడుగుగా ఆర్ ఐ,సచివాలయ సర్వేయర్ కూడా కాలువ పోరంబోకు భూమి 30 మీటర్లు వరకు ఉన్నట్లు తెలిపారు.మండల సర్వేయర్ సత్యనారాయణ మాత్రం పూర్తి వివరణ ఇవ్వకుండా 30 మీటర్లు ఉన్నది కరెక్టే, ఫెన్సింగ్ కంచె దగ్గరలో 2,3మీటర్లు ఉన్నది కూడా కరెక్టే అని చెబుతున్నారు.

అయితే అక్కడి గ్రామస్తులు మాత్రం తాము రైల్వే స్టేషన్లు,ఎయిర్ పోర్ట్ లు కట్టడానికి స్థలం అడగటం లేదని, కేవలం మా గ్రామంలో ఎవరైనా మరణించినట్లయితే స్మశాన వాటికకు వెళ్లేందుకు దారి ఇమ్మని అడుగుతున్నామని వాపోతున్నారు. రెవెన్యూ సిబ్బంది మాత్రం ఇలా తప్పుడు సర్వేలు చేసి చెప్పడం చాలా బాధాకరమని వారు అంటున్నారు.

అయితే గిరిజనేతరుడైన బండారు నూకి నాయుడు వేసినటువంటి పామాయిల్ తోట పూర్తిగా ప్రభుత్వ భూమిలో ఉంటే..ఇక్కడ నివసిస్తున్న ప్రజల ప్రయోజనార్థం కనీసం స్మశాన వాటికకు దారి కూడా చూపించి ఇవ్వడం లేదని రెవెన్యూ సిబ్బందిపై ఆ గ్రామస్తులు మండిపడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.