పెదవలస సచివాలయం పరిధిలో రెండవరోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.
అల్లూరి జిల్లా జీకే వీధి మండలం పెదవలస సచివాలయం పరిధిలో ఈరోజు బొంతువలస, చాపరాతిపాలెం,పిల్లిగొంది,పెదవలస గ్రామాల్లో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కొన్ని గ్రామాల్లో ప్రజలు ముఖ్యంగా అంగన్వాడీ భవనాలు,సీసీ రోడ్లు కావాలని ఎమ్మెల్యే ని కోరారు.వారు తెలిపిన సమస్యలు ఖచ్చితంగా తీరుస్తామని హామీ ఇచ్చారు.
అలాగే చాపరాతిపాలెం గ్రామంలో జుంబు పార్వతి అనే మహిళ మాట్లాడుతూ ఎమ్మెల్యే వారి ఇంటి వద్దకు రావడం చాలా ఆనందంగా ఉందని,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయని, వైఎస్ఆర్ చేయూత డబ్బులతో పిండి ఆడించే మిల్లు కొనుక్కున్నామని,ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే ఎప్పుడూ మా గుండెల్లోనే ఉంటారని ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోయిని కుమారి, జడ్పిటిసి శివరత్నం, ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, వైస్ ఎంపీపీలు సప్పగెడ్డ ఆనందరావు, దేముడు,స్థానిక సర్పంచ్ కృష్ణవంశీ, మండల పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్,పీఎసీఎస్ చైర్మన్ ప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ ఇర్మియా, ఏఎంసీ డైరెక్టర్ త్రిమూర్తి, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు రామకృష్ణ, జీకే వీధి ఎంపీటీసీ నాగమణి,దేవరాపల్లి ఎంపీటీసీ కృష్ణమూర్తి,మండల నాయకులు అంజి,వంతల ఆనందరావు,పెదవలస మాజీ సర్పంచ్ బాలరాజు, వైసిపి పెదవలస పంచాయితీ కన్వీనర్ లంబసింగి రమేష్ తదితరులు పాల్గొన్నారు.