Breaking News

అనాధ పిల్లలకు బట్టలు నోట్ బుక్స్ పంపిణీ చేసిన టీడీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు జగదీష్.

0 21

 అనాధ పిల్లలకు బట్టలు నోట్ బుక్స్ పంపిణీ.

టిడిపి నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు బుక్క జగదీష్.


అల్లూరి జిల్లా,పాడేరు న్యూస్:

నవజీవన్ నిరశ్రిత సేవా కేంద్రము 21మంది అనాద పిల్లలకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు బుక్క జగదీష్, సోనాయి,సన్యాసమ్మ టీచర్,సోనాయి,భీమరాజు కలిసి ఆదివారం బట్టలు,బాక్సులు,నోట్ బుక్స్,25కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అనాధ ఆశ్రమంలో ఎటువంటి సమస్యకైనా మా తరపున చేయాల్సిన సహాయ సహకారాలు మీకు పూర్తిగా చేస్తానన్నారు.


అనాద పిల్లలు అంటే దేవుళ్లతో సమానమని అటువంటి పిల్లలకు మనం సహాయం అందించే దాంట్లో మన మనసు తృప్తిగా ఉంటుందన్నారు. ఇటువంటి పిల్లల కోసం అనేకమంది ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నవజీవన్ నిరశ్రిత సేవా కేంద్రము సిబ్బంది పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.