Breaking News

జీకే వీధి:అంగన్వాడీ భవనం ఉంది.టీచర్ నియామకం ఎప్పుడు?

0 19

జీకే వీధి:అంగన్వాడీ భవనం ఉంది.టీచర్ నియామకం ఎప్పుడు?

శనివారం గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి అల్లూరి జిల్లా జీకే వీధి మండలం పెదవలస సచివాలయ పరిధిలోని పిల్లిగొంది గ్రామానికి విచ్చేసి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి అక్కడున్న సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్న నేపథ్యంలో తమ గ్రామంలో అంగన్వాడి టీచర్ ని నియమించాలని గ్రామస్తులు ఎమ్మెల్యే ని కోరారు.

సుమారుగా 10 సంవత్సరాల క్రితమే అంగన్వాడీ భవనం కట్టారని కానీ ఇప్పటివరకు అంగన్వాడీ టీచర్ ని నియమించలేదని గ్రామస్తులు తెలిపారు. దీంతో అక్కడికి వచ్చిన అంగన్వాడీ సూపర్వైజర్ ని అంగన్వాడీ భవనం కట్టి 10 సంవత్సరాలు అవుతుంటే ఇప్పటివరకు ఎందుకు టీచర్ ని నియమించలేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. వెంటనే అంగన్వాడి టీచర్ ని నియమించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.ఆ గ్రామస్తులను పూర్తి వివరాలు అడగగా అంగన్వాడీ టీచర్ ని నియమించమని అనేకసార్లు సంబంధిత అధికారులకు తెలియజేసిన ఎవరు పట్టించుకోవడంలేదని, వారిది పెదవలస పంచాయితీ అని కానీ లక్కవరపుపేట పంచాయితీ సురవరం గ్రామం నుండి అంగన్వాడీ కేంద్రానికి పిల్లలకు వచ్చే గుడ్లు, పాలు వంటివి తెచ్చుకోవాల్సి వస్తుందని మీడియా వారికి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.