Breaking News

1/70 కి తూట్లు పొడిస్తే సహించేది లేదు:గిరిజన సంఘం

0 18

 1/70 కి తూట్లు పొడిస్తే సహించేది లేదు:గిరిజన సంఘం


తెలంగాణ రాష్ట్రం భద్రాది గూడెం జిల్లాలో గిరిజనేతరులు 1/70 చట్టాన్ని తొలగించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని గిరిజన సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు.

  దీనికి వ్యతిరేకంగా అల్లూరి జిల్లా, కొయ్యూరు మండల కేంద్రంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసనగా రాస్తారోకో చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా గిరిజన సంఘం ఉపాధ్యక్షులు సరుమూర్తి సూరిబాబు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో భూమిపైన, అడవులు పైన, అన్నిటి మీద సర్వహక్కులు ఆదివాసుల వేనని అన్నారు. 1/70 చట్టాన్ని ఆదివాసులు పోరాటం ద్వారా సాధించుకున్న చట్టమని,, ఐదో షెడ్యూల్లో గిరిజనేతరులకు హక్కులు ఉండవని, సమత జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు తీర్పుని మర్చిపోకూడదని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వము కూడా గిరిజనేతరుల కింద సుప్రీంకోర్టు అన్నారు.1917 లోనే బ్రిటిష్ వారు ఆదివాసులు పోరాటాలకు తల ఒగ్గి భూ బదలాయింపు చట్టాన్ని చేశారని అన్నారు.

   ఇప్పటికే హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో అనంతగిరి,చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టులు నిర్మాణాలు జరపాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులను చట్టాలను కాలరాసి కార్పోరేట్లయిన ఆదాని శిరిడి సాయి కంపెనీలకు అప్పగించాయని అన్నారు. ఇప్పటికే హైడ్రో పవర్ ప్రాజెక్టులు గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తుందని,, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులను, చట్టాలను రద్దు చేయాలని కుట్రలు జరుగుతున్నాయని యావన్మంది గిరిజనులు గిరిజన ఉద్యోగులు ప్రగతిశీల శక్తులు అభ్యుదయవాదులందరూ ఈ విషయాన్ని ఖండించాలని కొయ్యూరు గిరిజన సంఘం మండల కమిటీ విజ్ఞప్తి చేస్తుందని చెప్పారు.

 ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై. అప్పలనాయుడు,గిరిజన సంఘం నాయకులు గూడెం లక్ష్మణరావు, టిడిపి ఎస్టీ సెల్ ఎంవివి ప్రసాద్, కొయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు,యువజన నాయకులు ఈరోజు బుజ్జిబాబు,కుమార్,గిరిజన సంఘం సభ్యులు, సానుభూతిపరులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.