జీకే వీధి:ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీపీ,వైస్ ఎంపీపీలు.
అల్లూరి జిల్లా,జీకే వీధి మండలం,పెదవలస సచివాలయ పరిధిలో ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పెదవలస పంచాయితీ లోని పెదలంక,మొండిగెడ్డ పంచాయితీ లోని వనబలింగం గ్రామాల్లో పాఠశాలలు మంజూరు చేయాలని గ్రామస్తులు ఎమ్మెల్యే ని కోరారు.ఈ క్రమంలో ఎమ్మెల్యే.. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కి ఈ సమస్యలు తెలియజేయడం జరిగింది.వెంటనే రెండు పాఠశాలలు కూడా మంజూరు చేయడం జరిగింది. గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించిన రెండు రోజుల్లోనే రెండు పాఠశాలలు మంజూరు చేసేందుకు కృషిచేసిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి కి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కి, జీకే వీధి మండలం ఎంపీపీ బోయిని కుమారి, వైస్ ఎంపీపీ లు సప్పగెడ్డ ఆనందరావు, లోతా దేముడు,మండల పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి లక్ష్మణ్,పెదవలస సర్పంచ్ కృష్ణవంశీ ఎమ్మెల్యే కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.