Breaking News

వాలంటీర్ కి అరకు ఎంపీ దంపతులు చేయూత.

0 50

 వాలంటీర్ కి అరకు ఎంపీ దంపతులు చేయూత.

పదివేల రూపాయలు ఆర్థిక సహాయం.


అల్లూరి జిల్లా చింతపల్లి మండలం తాజంగి నుండి పక్క గ్రామానికి వెళ్తున్న గ్రామ వాలంటీర్ లువాబు రవి కిరణ్ ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు పడి కోలుకోలేని రీతిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమాచారం సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అరకు ఎంపీ గొట్టేటి మాధవి తెలుసుకొని విషయాన్ని తన భర్త అయిన నేను సైతం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శివప్రసాద్ కి తెలుపగా వారు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని పదివేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందజేసి డాక్టర్ తో మాట్లాడి వాలంటీర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి పరామర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు.

శివ ప్రసాద్ పిలుపుమేరకు కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు.

అనంతరం పినాకిల్ హాస్పిటల్ నుండి కింగ్ జార్జ్ హాస్పిటల్ కి శివప్రసాద్ తరలించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నేను సైతం చారిటబుల్ డైరెక్టర్లు కొరుప్రోలు పృథ్వీరాజ్,పంచాడి శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.