Breaking News

విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.

0 19

 విదేశీ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.


ఈరోజు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ,విదేశీ వ్యవహారాల కమిటీ,స్టడీ టూర్ అధ్యయన పర్యటనలో భాగంగా రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరంలో జరిగిన సమావేశంలో సహచర పార్లమెంటు సభ్యులతో కలిసి అరకు పార్లమెంట్ సభ్యురాలు గొడ్డేటి మాధవి పాల్గొన్నారు.


అనంతరం పాస్పోర్ట్ కేంద్రాన్ని సందర్శించిన విదేశాంగ వ్యవహారాల కమిటీ సభ్యురాలు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి.పాస్పోర్ట్ కేంద్ర అధికారులు కమిటీ సభ్యులకు స్వాగతం పలికారు.


స్టడీ టూర్ పై వెళ్ళిన విదేశాంగ వ్యవహారాల కమిటీ సభ్యులు రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ లోని పాస్పోర్ట్ కేంద్రాన్ని విదేశాంగ వ్యవహారాల కమిటీ సభ్యులతో కలిసి అరకు ఎంపీ సందర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో కలిసి పాస్పోర్ట్ ఏ విధంగా జారీ చేస్తారన్న విషయాన్ని,పాస్పోర్ట్ ధరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలను అదేవిధంగా ధరఖాస్తు చేసుకున్న ఎన్ని రోజుల కాలవ్యవధిలో పాస్పోర్ట్ లబ్ధిదారులకు అందజేస్తారన్న సమాచారం అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.