ఉత్తమ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా అవార్డు అందుకున్న హరిదేవ్.
అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలం,డౌనూరు బాలుర ఆశ్రమ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కొక్కుల హరిదేవ్ ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు.ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి,ఐటీడీఏ పీవో రోణంకి గోపాలకృష్ణ ఉన్నారు.ఈ అవార్డు అందుకున్న నేపథ్యంలో సహచర మిత్రులు, ఉపాధ్యాయులు హరిదేవ్ కి శుభాకాంక్షలు తెలిపారు.