Breaking News

కొయ్యూరు:లోకేష్ కుమార్ కి ఉత్తమ ఎస్ఐ గా అవార్డు.

0 19

 కొయ్యూరు:లోకేష్ కుమార్ కి ఉత్తమ ఎస్ఐ గా అవార్డు.


అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలం లోని మంప ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న లోకేష్ కుమార్ రిపబ్లిక్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చేతులు మీదుగా ఉత్తమ ఎస్ఐ గా అవార్డు అందుకున్నారు.ముఖ్యంగా తన విధి నిర్వహణలో భాగంగా మారుమూల గిరిజన గ్రామాల్లో నివసించే ప్రజలతో,యువతతో ఫ్రెండ్లీ గా ఉంటూ అసాంఘిక,చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని అవగాహన కలిగిస్తూ ఉంటారు.ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఎస్ఐ గా అవార్డు అందుకున్న లోకేష్ కుమార్ కి తోటి పోలీస్ సిబ్బంది,కొయ్యూరు ప్రజలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి,జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.