Breaking News

రంపుల,తీయమామిడి గ్రామంలో విత్తనాల పండుగ.

0 21

 రంపుల,తీయమామిడి గ్రామంలో విత్తనాల పండుగ.


ఈ విత్తనాలు పండగలో భాగంగా ఆదివాసి గిరిజన గ్రామాలలో తమ పూర్వికులు ఆచరిస్తున్న సిద్ధాంతాలకు అనుగుణంగా అల్లూరి జిల్లా, జీకే వీధి మండలం, పెదవలస పంచాయితీ లోని రంపులు వీధి తీయమామిడి గ్రామంలో విత్తనాలు పండుగ జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సాంప్రదాయాలతో కూడిన దింసా, కోలాట నృత్యాలతో అందర్నీ ఆహ్లాదపరచటం చాలా సంతోషకరమైన అనుభూతిని ఇచ్చింది అని మండల వైస్ ఎంపీపీ సప్పగెడ్డ ఆనందరావు కొనియాడారు.పెదవలస పంచాయతీ పరిధిలో రంపులు గ్రామంలో స్థానిక సర్పంచ్ కృష్ణవంశీ అలాగే గ్రామస్తుల ఆహ్వానం మేరకు  స్థానిక ప్రజా ప్రతినిధులు,పంచాయితీ నాయకులు,మండల వైస్ ఎంపీపీ  సప్పగడ్డ ఆనంద్, పెదవలస పంచాయతీ సచివాలయం కన్వీనర్ ఎల్.రమేష్,వార్డు సభ్యులు దేశెట్టి.రాంబాబు, దొరబాబు,నాని, కంకిపాటి శరభన్నపడాల్,మాజీ సర్పంచులు ఎం.రాంబాబు, భాస్కర్, గ్రామ పెద్దలు,పెదవలస వర్తక సంఘం నాయకులు మహమ్మద్,శ్రీను,వాలంటీర్స్ ఈ విత్తనాల పండుగకు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.