Breaking News

గదబపాలెం పంచాయితీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

0 16

 గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి.


అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం,గదబపాలెం పంచాయితీ లోని కొత్తూరు,గదబపాలెం, మల్లవరం గ్రామాల్లో ముఖ్య అతిథిగా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి పాల్గొని గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 382 గడపలను ఆమె సందర్శించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొత్తూరు గ్రామంలో చెరువు పూడిక తీత పనులు సగసగం చేసి వదిలేసారని, నీరు నిల్వ ఉండేటట్లు అయితే చెరువు కిందనున్న అనేక పంట పొలాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. కనుక నీరు నిల్వ ఉండేలా పనులు చేపట్టి గేట్ వాల్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ని కోరారు. సంబంధిత అధికారులకు ఈ సమస్యను తెలియజేసి ఈ సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.అలాగే పెద గదబపాలెంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడ జరుగుతున్న నాడు నేడు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉల్లి నరసమ్మ, స్థానిక ఎంపీటీసీ బిడిజన అప్పారావు,ఎంపీపీ బడుగు రమేష్,జెడ్పిటిసి వారా నూకరాజు, ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ, వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ, పార్టీ మండల అధ్యక్షుడు జల్లి బాబులు, బీసీ డైరెక్టర్ గాడి నాగమణి,మాజీ పార్టీ మండల అధ్యక్షుడు సుమర్ల సూరిబాబు, మండల కన్వీనర్ బండి సుధాకర్, సర్పంచ్ ఫోరం అధ్యక్షులు ముసిలి నాయుడు,డౌనూరు సర్పంచ్ పొట్టిక భవాని,మూలపేట సర్పంచ్ వెంకటలక్ష్మి, నల్లగొండ సర్పంచ్ జంపా రాజకుమారి,కోడా రాజు బాబు,మండల నాయకులు నీలాపు సూరిబాబు,రీమల గంగాధర్,వనుంబాబు,సురేష్ పట్నాయక్,నేగుల లక్ష్మణ్ రావు, ఉల్లి రామ్మూర్తి, గాంధీ,ఎంపీడీఓ మేరీరోజ్,కొండగోకిరి పంచాయితీ కన్వీనర్ రామరాజు,సచివాలయ సిబ్బంది, వైసిపి పార్టీ కార్యకర్తలు, అభిమానులు,వాలంటీర్లు,అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు,ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.