వైసీపీ పార్టీ మండల కన్వీనర్ గా సుధాకర్.
అల్లూరి జిల్లా కొయ్యూరు మండల వైసీపీ పార్టీ కన్వీనర్ గా బండి సుధాకర్ ని నియమించినట్లు పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి తెలిపారు.నాయకులు,కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.సచివాలయ కన్వీనర్లతో,గృహ సారధులతో ఈనెల 7వ తేదీ లోపు సమావేశం ఏర్పాటు చేయమని నాయకులకు ఎమ్మెల్యే తెలిపారు.సమావేశానికి తాను కూడా హాజరవుతానని ఎమ్మెల్యే అన్నారు.అనంతరం ఎమ్మెల్యే మండల నాయకులతో కలిసి సుధాకర్ ని దుశాలువాతో సన్మానించారు.