అల్లూరి జిల్లా,జీకే వీధి మండలం దామనాపల్లి పంచాయతీలోని దొడ్డి కొండ,బొర్రమామిడి,కట్టుపల్లి, భీమవరం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యకమానికి ముఖ్య అతిగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి హాజరయ్యారు.
ఈ సందర్భంగా డ్రైనేజీ ఏర్పాటు, కరెంట్ స్తంభాల కొరత తీర్చాలని బొర్రమామిడి గ్రామస్తులు ఎమ్మెల్యే తో చెప్పారు.పలు గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ హాల్స్,సిసి రోడ్లు నిర్మాణాలను చేయించాలని ఎమ్మెల్యేని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం అధ్యక్షులు కుందేరి రామకృష్ణ, జడ్పీటీసీ శివరత్నం,ఎంపీపీ బోయిన కుమారి,మండల అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్,వైస్ ఎంపీపీ సప్పగెడ్డ ఆనందరావు,పీఎసీఎస్ చైర్మన్ ప్రసాద్, ఎంపీటీసీ నాగమణి, ఏఎంసీ వైస్ చైర్మన్ యిర్మీయా,స్థానిక ఎంపీటీసీ భీమరాజు,పెదవలస సర్పంచ్ క్రిష్ణ వంశీ, ఏఎంసీ డైరెక్టర్ త్రిమూర్తి,మండల నాయకులు గిరి, మండల బూత్ కన్వీనర్,ఎంపీటీసీ కృష్ణమూర్తి, మండల అధికారులు, సచివాలయం సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.