అల్లూరి మన్యం గిరిజన గ్రామాలలో రాజులుబాబు పండగ సందడి.
అల్లూరి సీతారామరాజు జిల్లా,గూడెం కొత్త వీధి మండలం,
దుచ్చరపాలెంలో ఆదివాసి గిరిజనులు రాజులు బాబు పండగను వైభవంగా జరుపుకుంటూ గ్రామస్తులందరూ విందు వనభోజనం లో పాల్గొన్నారు.
గ్రామకుల పూజారులు పలాసి చిన్నెలదొర,గుమ్మల రాము, వడేలి లక్ష్మయ్య,సోమరాజు,లైకాన్ మాట్లాడుతూ ప్రతి గిరిజన రైతు కుటుంబాలు నిత్యం అడవుల్లో నివసించే జంతువులతో వాళ్ళ జీవనం గడుపుతూ అడవిలో ఉంటున్న తమకు ఎటువంటి హాని తలపెట్టకుండా ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా చూసేది రాజులు బాబు అని ప్రతి సంవత్సరం వారిని స్మరిస్తూ ఈ పండగ జరుపుకుంటామని అన్నారు.
ఈ రాజులు బాబు పండగలో గ్రామస్తులందరూ పండగ చేసుకుంటు అడవిలో పండేటువంటి పంటను కోసుకుంటారు.ముఖ్యముగా చీపురు,అడ్డ పిక్కలు,చీడి పళ్ళు,ఉసిరికాయలు ప్రకృతి ఒడిలో నుంచి అనేక పండ్లును సేకరించి,
ఈ పంటలన్నీ కూడా రాజులు బాబు పండగ చేసుకొని గిరిజనులు ఆచరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుష్ప కుమారి,సాగిన రామరాజు పడాల్, వీరభద్ర పడాల్,బాలయ్య పడాల్, ముర్ల బాలయ్య, జోగి పడాల్,భీమేష్, లక్ష్మణ్, బంగార్రాజు, బ్రహ్మాజి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.