Breaking News

సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా.

0 20

 సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా.

 గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి.


 ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలలో ఆర్థిక భరోసా లభించిందని పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. సంక్షేమ పథకాల రూపంలో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఏర్పడిందని వీటి ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు ప్రయత్నించడం సంతోషదాయకమని ఆమె తెలిపారు.


జీకే వీధి మండలం అన్నవరం,ఎస్సార్ నగర్ కాలనీ, పులుసు మామిడిలొద్ది,సిగనపల్లి, లింగావరం,మోతిక బంద గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు.

మొత్తం 287 గడపలను సందర్శించి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు గురించి లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే తెలియజేయాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని గడపగడపలోను తెలియజేశారు. ఈ గ్రామాల్లో శాసనసభ్యులు పర్యటిస్తున్న సమయంలో ప్రతి ఇంట సాదన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వలన కొందరు గొర్రెలను, కొందరు మేకలను, పశువులను మరికొందరు ఇంటి వద్ద ఉండే పిండి మిల్లులను కొనుగోలు చేసుకుని వాటి ద్వారా ఉపాధి పొందుతున్నారని తెలిపారు. చాలామంది ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా వచ్చినటువంటి డబ్బులతో ఉపాధి మార్గాలను ఎంచుకోవడం సంతోషదాయకమని భాగ్యలక్ష్మి చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కుందేరి రామకృష్ణ, వైస్ సర్పంచ్ చిలకమ్మ,ఎంపీపీ బోయిన కుమారి, జెడ్పిటిసి కిముడు శివరత్నం, మండల అధ్యక్షులు బొబ్బిలి లక్ష్మణ్, జీకే వీధి సర్పంచ్ కొర్ర సుభద్ర, వైస్ సర్పంచ్ రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ జైతి రాజులమ్మ, వైస్ చైర్మన్ యిర్మియ, ఏఎంసీ డైరెక్టర్ అచ్యుత్, ఎంపీటీసీలు పసుపులేటి నాగమణి, కృష్ణమూర్తి, సచివాలయం కన్వీనర్ సతీష్, సీనియర్ నాయకులు రాజారావు, సిహెచ్ బాలరాజు, తెల్లన్నదొర, కృష్ణపడాల్, వార్డు మెంబర్లు సావిత్రి, పార్వతమ్మ, వార్డ్ మెంబర్లు నాయకులు, కార్యకర్తలు అధికారులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.