మృతి చెందిన గిరిజన కార్మికుల కుటుంబాలను పరమర్శించిన రాష్ట్ర SC,ST కమీషన్ మాజీ సభ్యులు,అరకు నియోజకవర్గ టీడీపీ నేత సివేరి అబ్రహం
కాకినాడ జిల్లా పెద్దపురం మండలం జి.రాగంపేటలో నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీ ఆవరణలో శుక్రవారం ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేసేందుకు దిగి ఏడుగురు కార్మికులు మృతిచెందారు. మృతుల్లో ఐదుగురు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలానికి చెందిన వారు.వారి కుటుంబాల్లో ధైర్యం నింపేందుకు శనివారం బాధిత కుటుంబాల గ్రామాలైన పర్రెడు పంచాయతీ లక్ష్మీపురం,యునెచ్డ్ పుట్టు,సామ్ పుట్టు పర్యటించి వారికి ధైర్యం నింపి టీడీపీ పార్టీ అండగా ఉంటుందని సివేరి అబ్రహం భరోసా ఇచ్చారు.ఆర్ధిక సహాయం చేసారు. సందర్భంగా సివేరి అబ్రహం మాట్లాడుతూ.. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు.అన్ని విధాలుగా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలని నష్టపరిహారంగా 50 లక్షల రూపాయలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.టీడీపీ సీనియర్ నేతలు త్రినాథరావు, కొండయ్య,కమ్మిడి సుబ్బారావు,కామేశ్వరరావు, స్వామి తదితరులు పాల్గొన్నారు.