Breaking News

గోపవరం లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు.

0 17

 గోపవరం లో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు.


అల్లూరి జిల్లా,కొయ్యూరు మండలం,చిట్టెంపాడు పంచాయితీ లోని గోపవరం గ్రామంలో శనివారం ఉచిత మెగా డయాబెటిక్ వైద్య శిబిరం శ్రీ సాయి సంజీవని హాస్పిటల్  సుర్ల నాయుడు బాబు (ఎండీ జనరల్,షుగర్ వ్యాధి నిపుణులు) వారిచే..అలాగే డౌనూరు ఎంపిటిసి బిడిజన అప్పారావు,స్థానిక చిట్టెంపాడు పంచాయితీ ఉప సర్పంచ్ పాడి దారలక్ష్మీ, గాంధీ,అప్పన్న బాబు,ఆశ లక్ష్మీ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.


గోపవరం గ్రామంలో గ్రామస్తులు, పెద్దలు,చుట్టు ప్రక్కల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగంగా 120 మందికి వైద్యపరీక్షలు,బి.పి,షుగర్ గుండె,ఊపిరితిత్తులు,కాలేయం, మూత్రపిండాలు,నరాలు,ఎముకలు, విషజ్వరాలు డెంగ్యూ,మలేరియా మొదలగునవి బి.పి,షుగర్,థైరాయిడ్,రక్త పరీక్ష లు,మూత్ర మొదలగు పరీక్షలు ఉచితంగా చేసారు.

డాక్టర్ సలహాతో మందులను కుడా ఉచితంగా ఇవ్వడం జరిగింది.గోపవరం గ్రామ ప్రజలు,గ్రామస్తులు డాక్టర్ సుర్ల నాయుడు బాబు ని, సిబ్బంది తులసి,సుస్మిత,ప్రసాద్ ను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.    పొల్లుదొర,నాగరాజు,మల్లేశ్వరరావు,వెంకటేష్,బుల్లబ్బాయి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.