Breaking News

పాడేరు లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సమావేశం.

0 44

పాడేరు లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సమావేశం.


అల్లూరి సీతారామరాజు జిల్లా,పాడేరు లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సమావేశం ఈరోజు నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని కోరారు.అలాగే మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ ఎంతోమంది నాయకులను తయారుచేసిన ఘనత సీతంరాజు సుధాకర్ అని, అలాగే అధికారం వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు అడిగితే చేస్తారో లేదో తెలియని పరిస్థితిలో..అడగకపోయినా అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ని గెలిపించాలని ఆయన కోరారు.జి.మాడుగుల జడ్పీటీసీ మత్స్యరాస వెంకటలక్ష్మి మాట్లాడుతూ సీతంరాజు సుధాకర్ ఏ పదవి ఆశించకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేశారని,ఆయన పార్టీ కి చేస్తున్న కృషి ఫలితమే ఈరోజు స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఎమ్మెల్సీ అభ్యర్థి గా ఆయన పేరును ప్రతిపాదించడం జరిగిందని కనుక సీతంరాజు సుధాకర్ ని గెలిపించుకోవాలని అన్నారు.


జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీతంరాజు సుధాకర్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించి ప్రతిపక్షాల వారికి మన సత్తా ఏంటో చూపించాలని, తద్వారా త్వరలో రాబోయే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ కి మనం ఇంకా దీటుగా ఇంకెంత కష్టపడి పనిచేయాలో తెలుస్తుందని అన్నారు.

అరకు ఎంపీ గొడ్డేటి మాధవి మాట్లాడుతూ మండల,గ్రామస్థాయిలో ఎంతమంది పట్ట భద్రులు ఉన్నారో గుర్తించి మన ఎమ్మెల్సీ అభ్యర్థి కి ఓటు వేసి గెలిపించేందుకు ప్రతీ వైసీపీ నాయకులు,కార్యకర్తలు చొరవ తీసుకోవాలని ఎంపీ అన్నారు.

ఈ సమావేశంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి,జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు,జిసిసి చైర్మన్ శోభాస్వాతిరాణి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, చింతపల్లి ఏఎంసీ చైర్ పర్సన్ జైతి రాజులమ్మ,సర్పంచులు పాడేరు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలు జడ్పీటీసీలు,ఎంపీపీ లు,వైస్ ఎంపీపీ లు, ఐదు మండలాలు మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.