Breaking News

అల్లూరి జిల్లా: విద్యార్థిని మృతి.మృతికి కారకులెవరు?.

0 19

ఐ టి డి ఎ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్ధిని,విద్యార్థులకు పడుతున్న మృత్యువాతలు.

 అల్లూరి సీతారామరాజు జిల్లా,    జి.మాడుగుల మండలం,బంధవీధి లోనున్న బాలికల ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న కొర్రా కవితా అనే  విద్యార్థిని అనారోగ్యంతో అరగడపల్లి గ్రామంలో శుక్రవారం మరణించింది.

తన అనారోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని పాఠశాల వద్దకు తల్లిదండ్రులు వెళ్లి తమ కుమార్తెను పంపించమని అడిగినప్పటికీ పాఠశాల సిబ్బంది మాత్రం పంపించలేదని, పాపం హాస్పిటల్లో తామే జాయిన్ చేస్తామని చెప్పి వారిని పంపించేసారని కవిత తండ్రి నాగేశ్వరరావు చెబుతున్నారు.


తమ కుమార్తెను తమతో పాటు పంపించకుండా, ఆరోగ్యం మరింత క్షీణించిన తర్వాత తమకు తెలియజేయకుండానే పాపను స్కూల్ నుంచి ఇంటికి సింగిల్గానే పంపించేసారని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.


తాము కూడా హాస్పిటల్లో చూపించామని అయినప్పటికీ పాప బ్రతకలేదని,నిన్న శుక్రవారం సాయంత్రం 4గంటల సమయంలో మరణించిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.


గిరిజన ప్రాంతంలో ఆశ్రమ పాఠశాలల్లో ఒకవైపు విద్యార్థిని విద్యార్థులు మృత్యువాత పడుతూ ఉన్నప్పటికీ ఐ టి డి ఎ అధికారులు మాత్రం స్పందించిన దాఖలాలు మాత్రం మచ్చుకైనా కనిపించడం లేదు.

ఆశ్రమ పాఠశాలల్లోనికి అనుమతి లేకుండా ఆదివాసి సంఘాలు, మీడియా ప్రతినిధులు,అలాగే తల్లిదండ్రులు కూడా ఎప్పుడు పడితే అప్పుడు స్కూల్లోనికి రాకూడదు అని నిబంధనలు పెట్టినప్పుడు నుండి గిరిజన ప్రాంతంలో ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల మరణాల రేటు అధికమవుతుంది.

ఆశ్రమ పాఠశాలలో ఎన్ని సమస్యలు,ఎన్ని లోపాలు ఉన్నా ఎవరికి తెలియకుండా అధికారులు మాత్రం సర్క్యులర్ తీసుకొచ్చి చేతులు దులుపుకున్నారు.

ఈ విద్యార్థిని మరణానికి కారకులెవరు? మరి శిక్ష ఎవరికి?

 కవితా మృతదేహాన్ని పరిశీలించడానికి వెళ్ళి ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పి.జీవన్ కృష్ణ, కె.కార్తీక్,లత కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు.

 ఇప్పటికైనా స్పందించి ప్రతి ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల కోసం వైద్య సిబ్బందిని నియమించాలని, చనిపొయిన కవిత కుటుంబానికి 10 లక్షలు ఎక్ష్ గ్రెషీయా, ఒక ఉద్యొగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.